కారేపల్లిలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కారేపల్లి, మార్చి 13 : ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ పేద ముస్లిం కుటుంబాలకు శుక్రవారం రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసంలో మత సామరస్యానికి ప్రతీక, మత సామరస్య భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.
రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఆరాధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది నిత్యావసర సరుకుల సేకరణకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. అటువంటి వారికి కొంత ఉపశమనం కలిగించేలా తాను వివిధ రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్టును అందజేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి.ఖలీల్ ఉల్లా ఖాన్, మోషిన్, షేక్ సద్దాం, షేక్ అజార్, షేక్ పేరోజ్, షేక్ ముస్తాన్, ఎండి రియాజ్, షేక్ ఫకీరమ్మ, షేక్ అబ్దుల్ వాహబ్, షేక్ తోహిన్ పాల్గొన్నారు.

కారేపల్లిలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

