Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీలో ‘ఇండియా సీ’ జట్టు బోణీ కొట్టింది. ‘ఇండియా డీ’పై నాలుగు వికెట్ల తేడాతో రుతురాజ్ గైక్వాడ్ సేన ఘన విజయం సాధించింది. స్పిన్నర్ మానవ్ సుతార్(7/49) సంచలన బౌలింగ్‌తో ఇండియా డీ బ్యాటింగ్ లైనప్‌ను కూల్చాడు. ఆ తర్వాత 233 పరుగుల ఛేదనలో యువకెరటం అభిషేక్ పొరెల్ (35 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. దాంతో, మూడో రోజు ఆద్యంతం ఉత్కంఠ పోరులో ఇండియా సీ విజయఢంకా మోగించింది.
ఇండియా సీ అద్భుత విజయంలో బౌలర్లదే కీలక పాత్ర. అనంతపూర్‌లోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో మానవ్ సుతార్(7/49), పేసర్ విజయ్‌కుమార్(2/12)లు బంతితో ఇండియా డీ బ్యాటర్లను వణికించారు. దాంతో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఇండియా డీ స్వల్ప స్కోర్‌కే పరిమితం అయింది. తొలి ఇన్నింగ్స్‌లో అందరూ చేతులెత్తేసినా.. అక్షర్ పటేల్ (86) హాఫ్ సెంచరీతో మెరవడంతో 164 పరుగులకు ఆలౌట్ అయింది.
𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐂! 🙌
Abishek Porel (35*) and Manav Suthar (19*) hold their nerve to take India C past the finish line. They win by 4 wickets 👏
What an exciting roller-coaster of a match 🔥#DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/PcAyYzIC6z pic.twitter.com/4eUCQUBrK5
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
అనంతరం పేసర్ హర్షిత్ రానా(4/33) ధాటికి ఇండయా సీ కూడా 168 పరుగులకే కుప్పకూలింది. అయితే.. రెండో రోజు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(54), దేవ్‌దత్ పడిక్కల్(56)లు హాఫ్ సెంచరీలో పోరాడగా ఇండియా డీ 236 పరుగులు చేసింది. ఆ తర్వాత 233 పరుగుల ఛేదనలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(46) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. అర్యన్ జుయల్(47), రజత్ పాటిదార్(44) లు కీలక భాగస్వామ్యంతో ఇండియా సీని గెలుపు వాకిట నిలిపారు. వీళ్లిద్దరూ త్వరగానే ఔటైనా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్(35 నాటౌట్) పట్టుదలగా ఆడాడు. మానవ్ సుతార్(19 నాటౌట్)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.