టేకులపల్లి, జనవరి 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సింగ్యాతండా(Singya Thanda) గ్రామంలో ఓ యువకుడు కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు. దాసుతండా పంచాయతీ సింగ్యాతండాలో బోడ వెంకన్న కత్తి పట్టుకొని చుట్టుపక్కల ఇళ్లలోనికి చొరబడి.. అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు.
టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగ్యాతండా గ్రామానికి చెందిన బోడ వెంకన్న కత్తి పట్టుకొని తన బంధువైన బోడ గన్నా ఇంట్లోకి వెళ్లాడు. ఆ సమయంలో గన్నా ఇంట్లో లేడు. అతడి భార్య బోడ రజిత ఉంది. భూమి తగాదాల విషయమై వెంకతన్న ఆమెను బూతులు తిట్టాడు. వాషింగ్ మిషిన్, మూడు బైక్లు ధ్వంసం చేశాడు. అంతేకాదు భార్యాభర్తలిద్దరిని చంపేస్తానని వెంకన్న బెదిరించాడు. బోడ రజిత ఫిర్యాదు మేరకు వెంకన్నపై కేసు నమోదు చేశాం అని ఎస్ఐ రాజేందర్ తెలిపారు.