Honor Power 2 | మొబైల్స్ తయారు చేసే హానర్ కంపెనీ హానర్ పవర్ 2 స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ 6.79 ఇంచుల 1.5కె 120 హెడ్జ్ అమోలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంది. 8000 నిట్ ల గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది. ఇది కొత్త మీడియా టెక్ డెమెన్సిటీ 8500 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 2.4 మిలియన్ల అంటుటు బెంచ్‌మార్క్ స్కోరును సాధించింది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ప్రధాన హైలైట్ ఏమిటంటే, ఇది ఆరు సంవత్సరాల మన్నిక గల 10,080 ఎంఏహెచ్ నాలుగవ తరం బ్యాటరీని కలిగి ఉంది. సొంత హానర్ విన్ సిరీస్ ఫోన్ ల తర్వాత 10,000 ఎంఏహెచ్ విభాగంలోకి ప్రవేశించిన రెండవ మొబైల్ ఫోన్ ఇదే కావడం విశేషం.
భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 216 గ్రాముల బరువుతో 8 ఎంఎం కంటే తక్కువ మందంతో ఉంది. ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ తో కూడా పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ డ్రాప్, షాక్, కంప్రెషన్ నుండి రక్షణ కోసం గోల్డ్ లేబుల్ త్రీ ఫ్రూఫ్ సర్టిఫికేషన్, ఎస్జీఎస్ ఫైవ్ స్టార్ సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంది. ఐపీ69కె వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ అధిక పీడన వాటర్ గన్ ప్రభావాన్ని, 85 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉష్ణాన్ని కూడా తట్టుకోగలదు. ఇక ఈ హానర్ పవర్ 2 ఫోన్ లో ప్రత్యేకమైన పవర్ సిగ్నల్ ఐలాండ్ డిజైన్, ఆర్ఎఫ్ ఎన్హాన్స్మెంట్ చిప్ సి1+ డ్యుయల్ రైల్ యాంటెన్నా డిజైన్ కూడా ఉన్నాయి. ఇవి బలహీనమైన నెట్వర్క్ సిగ్నల్ బలాన్ని 200 శాతం వరకు పెంచుతాయి.
అలాగే ఈ ఫోన్ 6.79 అంగుళాల 1.5 కె అమోలెడ్ 120 హెడ్జ్ డిస్ప్లే, 100 శాతం డీసీఐ – పీ3 కలర్ గామట్, 8000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంది. 3.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ 4ఎన్ఎం ప్రాసెసర్ ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ 256 జీబీ/ 512 జీబీ స్టోరేజ్ ను 12 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఒఎస్ 10.0ను కలిగి ఉంది. అలాగే డ్యుయల్ సిమ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ లో 50 ఎంపీ కెమెరా, ఓఐఎస్, 5 ఎంపీ అల్ట్రావైడ్ రికార్డింగ్, 4 కె వీడియో రికార్డింగ్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ కూడా ఉంది. హానర్ పవర్ 2 ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 34,840 లకు, 12 జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 38,710కు లభిస్తోంది.