Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్ మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత, సిబ్బంది నియామకాలు, ఆరోగ్య సేవల మెరుగుదల, ఫుడ్ కోర్టు టెండర్ సమీక్ష, ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల పెంపు వంటి 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచార యావ కోసం ట్రాక్టర్లో వెళ్లి, కళాశాల గోడ దూకి నానాయాగి చేసావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తమని భ్రమింపజేశావు. ముఖ్యమంత్రివై నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నవు గానీ, విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశావని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీకి వెళ్లి సమస్యలు పరిష్కరించారు. మేం చేసిన కృషిని కూడా కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశావు కాబట్టే ఈరోజు సమస్యలు పేరుకుపోయాయి. రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా నువ్వే ఉన్నావు. అప్పుడు గోడలు దూకి వెళ్లావు కదా, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అని హరీశ్‌రావు సూచించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినవ్. ఏమైంది రేవంత్ రెడ్డి? కొత్త వాటి ఊసు లేదు, ఉన్నదానికి దిక్కులేదు. ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నతమైన ట్రిపుల్ ఐటీ వరకు మీ 9 నెలల పాలనలో ధ్వంసం కాని విద్యావ్యవస్థ ఇంకేమైనా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు హరీశ్‌రావు.
మీ పాలనలో టీచర్లు లేక 1800 పాఠశాలలు మూతపడ్డాయి. కల్తీ ఆహరంతో ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోయాయి. 600 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలు కాగా, 40 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమస్యల నిలయంగా విద్యాలయాలు మారిపోయాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరించడంతో పాటు, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయింది అనడానికి ఇది మరో నిదర్శనం.
సమస్యలు పరిష్కరించాలని ఒకవైపు గురుకుల విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే, ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
పూర్తి స్థాయి వీసీ నియామకం, నిధుల గోల్… pic.twitter.com/mSQTPsVaqe
— Harish Rao Thanneeru (@BRSHarish) September 7, 2024
ఇవి కూడా చదవండి..
TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్‌లో తిరుమల లడ్డూ ప్రతిరోజు లభ్యం..!
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
Vinayakan | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ అరెస్ట్