TTD | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుమల లడ్డూ ప్రతి రోజు హైదరాబాద్‌లో లభ్యం కానుందని తెలిపింది. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ విక్రయించేవారు. భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని టీటీడీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్ నిరంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఒక్కో లడ్డూను రూ. 50కు విక్రయించనున్నారు. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ విక్రయాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించి, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
Paralympics | పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. నవదీప్ అరుదైన ఘనత
Vinayakan | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ అరెస్ట్