Paralympics | పారిస్ : పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్ మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఎఫ్-41లో తొలుత ఇరాన్ అథ్లెట్ స్వర్ణం దక్కించుకోగా, భారత అథ్లెట్ నవదీప్ రెండోస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.
అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.
మహిళల 200 మీటర్ల టీ12లో సిమ్రాన్ శర్మకు కాంస్యం దక్కింది. 24.75 సెకండ్లలో సిమ్రాన్ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరుకుంది. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు పడ్డాయి.
ఇవి కూడా చదవండి..
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
Hyderabad | గణేష్ మండపం వద్ద అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
TG Rains | రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మున్నేరుకు పోటెత్తిన వరద