Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీకో గణేషుడు కొలువుదీరాడు. ప్రతి గల్లీలో వినాయక మండపాలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే దిల్సుఖ్నగర్లోని పీఎన్టీ కాలనీలోని ఓ వినాయక మండపాన్ని పూర్తిగా పత్తితో అలంకరించారు. ఇక కాసేపట్లో వినాయకుడిని ప్రతిష్టించాలని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఆ మండపంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మెయిన్ స్విచ్ ఆన్ చేయగానే మంటలు ఎగిసిపడ్డాయి. పత్తితో అలంకరించడంతో క్షణాల్లోనే ఆ మండపం కాలి బూడిదైంది.
దైవ అనుగ్రహం ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదు. ఘటనకు ఐదు నిమిషాల ముందు మండపం వద్ద ఉన్న చిన్నారులు అందరు తమ ఇంటికి వెళ్ళారు. అలా వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. మండపం వద్ద చిన్నారులంతా కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
Vinayakan | శంషాబాద్ ఎయిర్పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ అరెస్ట్
TG Rains | రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మున్నేరుకు పోటెత్తిన వరద