HYDRAA | హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని హైడ్రా తన నోటీసుల్లో పేర్కొంది.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ జయభేరి సంస్థ మురళీ మోహన్‌కు చెందినది. హైడ్రా నోటీసులపై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు.
చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో తుమ్మడికుంట చెరువులో నిర్మించిన ఎన్ కన్వెషన్ కొద్ది రోజుల క్రితం హైడ్రా కూల్చివేసింది. అలాగే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
Vinayakan | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మలయాళ నటుడు వినాయకన్ అరెస్ట్
TG Rains | రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మున్నేరుకు పోటెత్తిన వరద
Horoscope | 08-09-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు