Vinayakan | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మలయాళ నటుడు వినాయకన్‌ను సీఐఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌ను ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులు విచారిస్తున్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరాడు.
కాగా, వినాయకన్కు వివాదాలేమీ కొత్తేం కాదు. గతేడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్టే స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో పలువురితో గొడవకు దిగారు. మద్యం మత్తులో తమ అపార్ట్మెంట్లో న్యూసెన్స్ చేస్తున్నారని, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో వినాయకన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట వినాయన్కు పోలీసులు మర్యాదగా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మలయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్రతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మలయాలను నటుడు వినాయకన్ అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు
గత ఏడాది మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన మలయాళ నటుడు వినాయకన్
సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నటుడు… pic.twitter.com/xM9wHeNOjn
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2024
ఇవి కూడా చదవండి..
TG Rains | రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. మున్నేరుకు పోటెత్తిన వరద
Horoscope | 08-09-2024 ఆదివారం.. మీ రాశి ఫలాలు
Kaloji Award | నలిమెల భాస్కర్‌కు ప్రజాకవి కాళోజీ పురస్కారం..