Khammam | మున్నేరుకు భారీగా వరద.. 16 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Khammam | ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Khammam | ఖమ్మం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం వరద ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వరద ప్రభావిత కాలనీల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతం డేంజర్ జోన్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
వరదల కారణంగా ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | దుండిగల్‌లో హైడ్రా కూల్చివేతలు.. లక్ష్మీ శ్రీనివాస విల్లాలు నేలమట్టం
Sriram Sagar | శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. 9 గేట్లు ఎత్తివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

