HYDRAA | హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దుండిగల్‌లోనూ హైడ్రా చర్యలు చేపట్టింది. మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను కూల్చేస్తున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోర్టుకు పోవడానికి వీలు లేకుండా వారాంతాల్లో మాత్రమే ఉండేలా హైడ్రా కూల్చివేతలు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. pic.twitter.com/cgrZhFjJbb
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని మల్లంపేట్ పరిధిలో ఉన్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ (విల్లాస్) లలో హైడ్రా కూల్చివేతలు. pic.twitter.com/T6O4PwDbVz
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024
ఇవి కూడా చదవండి..
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్
HYDRAA | టీడీపీ మాజీ ఎంపీకి షాక్.. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు