Nagarjuna Sagar | నల్లగొండ : కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉరకలేస్తోంది. నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో సాగర్ 18 గేట్లను ఎత్తి.. దిగువకు 1.14 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 1.86 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 311.44 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ఇక ఇవాళ సెలవు దినం కావడంతో సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. గేట్లను ఎత్తడంతో.. పాలపొంగులాంటి నీటి దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
BRS | వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్.. నేడు బీఆర్ఎస్ నిరసనలు
Meinhardt | సియోల్ ఎందుకు దండగ.. మెయిన్‌హార్ట్ ప్రాజెక్టులు ఉండగ
Telangana | గ్రూప్-1పై సర్కారు మొండివైఖరి.. రగులుతున్న నిరుద్యోగ తెలంగాణ