BRS | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి సరార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
రైతుబంధును పూర్తి గా ఎత్తివేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో క్యాబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి సరార్ రైతులకు చేస్తున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని స్పష్టం చేశారు. రేవంత్రెడ్డి కుట్రలను రైతులకు తెలిసేలా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రైతునోట్లో మట్టి..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతుందని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పిన మాటలను రేవంత్రెడ్డి సరార్ అక్షరాల నిజం చేసిందని తెలిపారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టి రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ సరార్కు రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.కేసీఆర్ రూ.10వేల ముష్టి వేస్తున్నాడు.. మేము రూ.25 వేలు ఇస్తామన్న సిఫాయి ఇప్పు డు ఎకడ అని నిలదీశారు. రేవంత్రెడ్డి రైతుల వద్దకు వెళ్తే వీపు చింతపండు అవటం ఖాయమని అన్నారు. వానాకాలం రైతు భరోసా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని.. లేదంటే కాంగ్రెస్ నాయకులను ఎకడికకడ ముట్టడిస్తామని హెచ్చరించారు.