MLC Kavitha | న్యూఢిల్లీ : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కీలక వాదనలు చేశారు. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. కవిత కస్టడీ పొడిగింపుపై వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు వాదనలు వినిపించారు. సెక్షన్ 50 పీఎంఎల్ఏలో భాగంగా
సాక్షులను ఒత్తిడి చేసి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేశారని మోహిత్ రావ్ కోర్టుకు మరోసారి స్పష్టం చేశారు. సాక్ష్యులు, అప్రూవర్ల వాంగ్మూలం నమోదు చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియోలు, ఆడియోలను మాకు ఇవ్వండి అని కవిత తరపు న్యాయవాది కోరారు. ఒత్తిడి చేసి నమోదు చేసిన వాంగ్మూలాలు న్యాయపరంగా చెల్లుబాటు కావు అని న్యాయవాది పేర్కొన్నారు.
శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ ఆరోపణలు చేయడం సరికాదు. శరత్ చంద్రా రెడ్డితో ఏవో లావాదేవీలు జరిగాయని ఈడీ అంటోంది కానీ… అనేక సంవత్సరాల నుంచి వారి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని, అవి కూడా బ్యాంక్ లావాదేవీలు అని న్యాయవాది మోహిత్ రావ్ మరోసారి స్పష్టం చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | గురుకుల పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి.. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సూచన
TG DSC | టీజీ డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల
Venu Swamy | వేణుస్వామికి షాక్.. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..!