Venu Swamy | వేణుస్వామికి షాక్.. తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు..!
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది.
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. మరో వైపు వేణుస్వామికి మద్దతుగా ఆయన భార్య వీణా వాణి వీడియో విడుదల చేసింది. మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వేణుస్వామి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 2027లో ఇద్దరు విడిపోతారంటూ వ్యాఖ్యానించారు. గతంలో సమంత, నాగ చైతన్య జంట సైతం విడిపోతారంటూ బయటపెట్టారు. ఆ తర్వాత పలు విషయాలపై జాతకాలు చెప్పినా ఏ ఒక్కటి జరుగలేదు.
ఇదిలా ఉండగా.. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. గతంలో సినిమాల విడుదల, రాజకీయాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి అబాసుపాలైనా ఆయనకు బుద్ధి రాలేదని.. వ్యక్తిగత విషయాలపై నలుగురిలో మాట్లాడకూడదనే జ్ఞానం లేకుండా వేణుస్వామి వాళ్లు విడిపోతారంటూ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. దీనికి స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద వేణుస్వామిని పిలిపించి వివరణ కోరుతామని పేర్కొన్నారు. టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

