KTR | గురుకుల పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి.. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సూచన
KTR | గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సర్కారుకు సూచించారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు కేటీఆర్‌ను ఆయన నివాసంలో మంగళవారం కలిసి.. సమస్యలను వివరించారు.
KTR | గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సర్కారుకు సూచించారు. నిరుద్యోగ గురుకుల అభ్యర్థులు కేటీఆర్‌ను ఆయన నివాసంలో మంగళవారం కలిసి.. సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సమస్యలు, వాటి పరిష్కారాలను కేటీఆర్‌కు వివరించారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో 9,024 పోస్టుల్లో డిసేన్డింగ్ ఆర్డర్ పాటించకపోవడం చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం మూలంగా సెకండ్ మెరిట్లో ఉన్న వారికి నష్టం జరుగుతుందని తెలిపారు.
గురుకుల పోస్టుల్లో భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను మిగతా మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గురుకుల విద్యార్థులు కేటీఆర్‌ను కోరారు. ఇప్పటికే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు జీవో ఎంఎస్ నంబర్ 81ను సవాల్ చేస్తూ ఐదు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం తరఫున.. జీవో 81ని అడ్డంకిగా చూపుతూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని కేటీఆర్‌కు తెలిపారు. గతంలో టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీఎస్ నిర్వహించిన వివిధ నోటిఫికేషన్లలో ప్రస్తుతం గురుకులాల్లో ఏర్పడుతున్నట్టుగానే భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు నిరుద్యోగులు నష్టపోకుండా ఉండడం కోసం జీవో నెంబర్ 81 అమలు చేయకుండా వన్ టైం రిలాక్సేషన్ కల్పించి పోస్ట్ మిగిలిపోకుండా డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు.
గతంలాగానే ఈ గురుకుల పోస్టుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. ఇందుకు బీఆర్ఎస్ పక్షాన ప్రతిపక్ష నాయకులుగా రాష్ట్రంలో ఉన్న గురుకులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల అనేకమంది న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిరుద్యోగులకు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా గురుకుల విద్యార్థులకు, డీఎస్సీ విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ ప్రతిపక్షంగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఫోన్ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని, అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గురుకుల నిరుద్యోగ విద్యార్థులు రత్న శేఖర్ రెడ్డి, స్వాతి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులకు గెల్లు శ్రీనివాస్, నిరుద్యోగ విద్యార్థులు దామోదర్ రెడ్డి, విక్రమ్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

