హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని, ఆ భూముల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, వాటిని స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వానికి స్పష్టం చే సింది. హైడ్రాతోపాటు పోలీసులు, రెవె న్యూ అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇండ్ల కూల్చివేతలకు దిగారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డా యి.
తమకు చెందిన 49 ఎకరాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఆర్ కృష్ణమోహన్ రాజు, మరో 84 మంది దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ముస్తాగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు.భూముల్లో ఎలాంటి జోక్యం చేసుకోరాదని ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు.