KTR | హైదరాబాద్ : చిట్టి నాయుడు ఎంత ప్రయత్నం చేసినా.. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లేని నాడు కేసీఆర్‌ను మరిచిపోతారని రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నడు. హైదరాబాద్‌లో సెక్రటేరియట్ వైపు వెళ్లినా, దాని ముందున్న అమర జ్యోతిని చూసినా, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసినా, కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గరికి వెళ్లినా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో సహా 36 ఫ్లై ఓవర్లను చూసినా కేసీఆర్ గుర్తుకు వస్తారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఎక్కడికి పోయినా కేసీఆర్ గుర్తుకు రాని సందర్భం ఉండదు. బాబు చిట్టి నాయుడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేని నాడు కేసీఆర్‌ను మరిచిపోతరు. చిట్టి నాయుడు ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్‌ను మరిపించే సత్తా మాత్రం ఆయనకు లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రుణమాఫీ చేయమని రైతులు నిలదీస్తున్నారు. రైతు బంధు కాదు రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు రైతుబంధు కింద ఇచ్చే పది వేలకు దిక్కు లేదు. రైతు భరోసా కాదు.. సీఎం కుర్చీకే భరోసా లేదు. ఎప్పుడు పీకుతడో తెలియదు.. ఖమ్మం, నల్లగొండ జిల్లాల నేతల మధ్య భయంతో బతుకుతున్నాడు. సీఎం కుర్చీకే భరోసా లేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక కేసీఆర్ ఇచ్చే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ 10 నెలల కాలంలో 5 లక్షల పెళ్లిళ్లు అయ్యాయి. ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే.. తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే అన్నడు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. రాహుల్ గాంధీ అశోక్‌నగర్ పోయి మాటిచ్చిండు.. ఈ రోజుకు 2 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మేం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తూ మేం ఇచ్చామని అంటున్నడు రేవంత్ రెడ్డి. 60 వేల ఉద్యోగాలు ఇచ్చానని నోటికొచ్చినంత మాట్లాడుతున్నడు. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
KTR | రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి : కేటీఆర్
KTR | హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి గుండెల్లో దడ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు