KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్వైరవిహారం చేస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం ఘాతుకాలు, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న భూ దందాలు, సెటిల్మెంట్లు, హైడ్రా పేరు మీద వసూళ్లతో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చిట్టి నాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే(సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి).. ఆదిలాబాద్‌కు చెందిన ఒక సీనియర్ నాయకురాలు నాలుగైదు నెలల కింద వచ్చి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు ఫోన్ చేయాలని అడిగారమె. మావోడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నడు.. జీహెచ్ఎంసీ వాళ్లు ఆపుతున్నారట.. ఎమ్మెల్యే చెప్తే అయిపోతదట.. అని ఆమె చెప్పారు. అప్పుడు మన పార్టీలోనే ఉండే.. ఇక నేను ఎమ్మెల్యేకు ఫోన్ చేశాను. సార్ జీహెచ్ఎంసీ కాదు.. అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తోంది.. 500 గజాల లోపల అయితే ఒక్కో స్లాబ్‌కు 10 లక్షలు, 1000 గజాల లోపు అయితే 18 లక్షలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ వాళ్లే చెబుతున్నారని మీ ఎమ్మెల్యేనే చెప్పారు. లేకపోతే కూలగొడుతాం అని చెప్పినట్లు చెప్పారు. మాదాపూర్‌లోనే తిరుపతి రెడ్డి ఆఫీసు ఉంది.. రోజుకు 200 మంది కనబడుతున్నారని చెప్పారు. చిట్టి నాయుడు గారి ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుందని మీ ఎమ్మెల్యేను చెప్పిండు అని కేటీఆర్ గుర్తు చేశారు.
అనగనగా..ఓ చిట్టి నాయుడు గారూ.. ఆ చిట్టి నాయుడు గారికి ఏడుగురు అన్నదమ్ముళ్లు.. ఇక తల ఓ దిక్కు పంచుకున్నరు. తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డడు. కొండల్ రెడ్డి గుట్టలు, కొండల మీద పడ్డడు. జగదీశ్ రెడ్డికి సడెన్‌గా వెయ్యి కోట్లు వచ్చాయ్. ఆయన తెలంగాణలో ఓ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతడంట. ఇంకో బామ్మర్దికి 1337 కోట్ల కాంట్రాక్ట్ సీఎం తన డిపార్ట్మెంట్లో ఇచ్చారు. ఎక్కడికక్కడ స్వైర విహారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. ఎందుకు ఢమాల్ అయిందంటే.. ఈ సీఎం ఘాతుకాలు, కుటుంబం చేస్తున్న భూ దందాలు, సెటిల్మెంట్లు, హైడ్రా పేరు మీద వసూళ్లు.. సీఎం ఏం సంబుర పడుతున్నారంటే.. బుగ్గకారు దొరికిందని.. పైన రాహుల్ గాంధీ పిలుస్తుండని.. 22 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిండు.. అది పెద్ద గొప్ప పని. ఈ 9 నెలల కాలంలో ఒక్క కొత్త పథకం లేదు. పెన్షన్లు పెంచలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే పెన్షన్లు పెంచారు. తెలంగాణలో మాత్రం 100 రోజుల్లో ఒక్క కొత్త పథకం కూడా అమలు కాలేదు. శేరిలింగంపల్లి ఉప ఎన్నిక కచ్చితంగా వస్తది. మీలోనే ఒకరు ఎమ్మెల్యే అవుతారు. 10 మంది కార్యకర్తలను కార్పొరేటర్లుగా గెలిపించుకుంటాం. ఈ బాధ్యత మేం అందరం తీసుకుంటాం అని కేటీఆర్ కార్యకర్తల్లో భరోసా నింపారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి : కేటీఆర్
KTR | దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకో.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్