KTR | హైదరాబాద్ : హైడ్రా పేరుతో నిరుపేదల నివాసాలను కూలగొడుతున్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఆ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిందేవరు..? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా పర్మిషన్ ఇచ్చింది.. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పేదోళ్ల కడుపు కొడుతున్నావు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు మాయం అయ్యాయి..? చెరువులను మాయం చేసింది నీ కాంగ్రెసోళ్లు కాదా..? మొన్న నాగార్జునది కూలగొట్టినవ్.. మరి పర్మిషన్లు ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా..? దాన్ని కట్టిందే నీ కాంగ్రెస్ హయాంలో 2007, 2008లో. మేం నోటీసు ఇస్తే ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నడు.. కాబట్టి మేం ముట్టలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇక మనం పదేండ్లలో మొత్తం ఆక్రమణలను ప్రోత్సహించామని కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. ఇక ఈ సిపాయిలు వచ్చి కాపాడుతున్నారట. మాట్లాడడానికి ఏమన్న సిగ్గుండాలి. తవ్వు మొత్తం తవ్వు.. తవ్వితే నీ వాళ్లే మొత్తం బయటపడుతారు. కుంభకోణాలు, లంబకోణాలు చేసిందంతా మీ కాంగ్రెసోళ్లే. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కూలగొడుతావో కూలగొట్టు.. నీళ్లలో కట్టిండు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టు. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలు, ఎంపీల అక్రమ నిర్మాణాలు కూలగొట్టు. ఆ తర్వాత పేద వాళ్ల మీదకు రా.. అంతేకానీ వీళ్లకు ఎవడు అండగా లేడు.. ఎవడేం చేస్తడు.. వీళ్లను లాగి బజార్లో వేస్తా అన్నట్టు వ్యవహరించడం సరికాదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి గుండెల్లో దడ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు