KTR | హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పిన సన్నాసి వెధవ ఎవడు..? అని శ్రీధర్ బాబును కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని సామెత ఉండేది.. మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. అధికారంలో లేం.. మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. కానీ ఇవాళ 150 మందితో సమావేశం అనుకుంటే.. వెయ్యి మందికిపైగా వచ్చారంటే శేరిలింగంపల్లి పోరాట స్ఫూర్తికి వందనం చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.
త్వరలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుంది. బరాబర్ మళ్లీ ప్రజలు బుద్ది చెబుతారు. అరికెపూడి గాంధీకి పార్టీ ఏం అన్యాయం చేసింది. ఎందుకు పోయావంటే సమాధానం లేదు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివిగా మాట్లాడుతుండు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకొని మమ్మల్ని అంటున్నరని అంటుండు. నేను ఒక్కటే అడుగుతున్నా శ్రీధర్ బాబును.. అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారూ.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మావోడు కాదు.. మీ వోడు అంటున్నవ్.. కొద్దిసేపు నీవు అంటున్నది నిజమే అనుకుందాం.. మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవరు..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, సీనియర్ నేత కే కేశవరావు ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పిన దౌర్భాగ్యుడు, సన్నాసి వెధవ ఎవడు..? చెప్పు శ్రీధర్ బాబు దమ్ముంటే. చెప్పుకునేందుకు కొంత సిగ్గుమానం ఉండాలి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి..
RS Praveen Kumar | డీఎస్సీ ఫలితాల విడుదల ఎప్పుడు..? ఆలస్యంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
KTR | అనుముల తిరుపతి రెడ్డి గారు.. ఆ కిటుకేదో సామాన్యులకు కూడా చెప్పండి: కేటీఆర్