RS Praveen Kumar | డీఎస్సీ ఫలితాల విడుదల ఎప్పుడు..? ఆలస్యంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
RS Praveen Kumar | డీఎస్సీ ఫలితాల విడుదలలో జరుగుతున్న జాప్యంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్లు అవసరం ఉందని చెప్పి హడావుడిగా పరీక్షలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫలితాల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తోందని అడిగారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : డీఎస్సీ ఫలితాల విడుదలలో జరుగుతున్న జాప్యంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్లు అవసరం ఉందని చెప్పి హడావుడిగా పరీక్షలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫలితాల విడుదలలో ఎందుకు జాప్యం చేస్తోందని అడిగారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి మెగా డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థులు వేడుకున్నా.. టీచర్లు అవసరముందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలను నిర్వహించారు. ఫైనల్ కీ ప్రకటించిన తర్వాత కూడా జనరల్ ర్యాంకింగ్ ప్రకటించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి, మెరిట్లో ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తే, పిల్లలకు పాఠాలు బోధించే వీలుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ వరకు నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారు. కానీ అమలుకు నోచుకోవడం లేదని ఆర్ఎస్పీ మండిపడ్డారు. రాష్ట్ర ఖజానాలోని సొమ్మును కొడంగల్, ఢిల్లీకి తరలించినట్లు అనిపిస్తుంది. అందుకే జీతాలకు డబ్బుల్లేక, గురుకుల టీచర్లకే ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.. ఇక డీఎస్సీ టీచర్లకు ఎక్కడ్నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. హైడ్రా పేరుతో అందరి దృష్టి మళ్లించి.. వచ్చే ఏడాది నియామక పత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు..? ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు..? విద్యాశాఖా మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద DSC పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ (CBT) లో నిర్వహించడం జరిగింది. చాల మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా, ప్రభుత్వం మాకు టీచర్లు తొందరగా అవసరమున్నది అని హడావుడిగా నిర్వహించింది.
అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపాటు
IT Raids | హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. ఓ న్యూస్ చానల్ అధినేత ఇంట్లో సోదాలు
High Court | స్పీకర్‌కు హైకోర్టు నోటీసు.. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ తాఖీదులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

