KTR | హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి గుండెల్లో దడ మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండ్ అయిందని కేటీఆర్ ఎద్దెవా చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండ్ అయితదని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని అవమానించిండు. ఇంటింటికి తిరిగి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావ్ కదా.. వారి బతుకు జూబ్లీ బస్టాండ్ అయింది. వారిని నువ్వు కాదన్నవడితివి.. మేం కాదన్నవడితిమి. రేపు ప్రజలు కూడా ఛీకొడుతారు. బుద్ది చెప్తారు. ఇంటింటికి తిరిగి చేర్చుకుని ఇప్పుడు కాదన్నవడితివి.. ఎందుకు భయమేస్తుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే.. మొన్న హైకోర్టు తీర్పుతో రేవంత్ గుండెల్లో దడ మొదలైంది. ఉప ఎన్నికలు వస్తాయి.. ప్రజలు బుద్ది చెప్తారని రేవంత్ భయపడుతున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.
పదవుల కోసం రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దమ్ముంటే ఈయనను పార్టీలో చేర్చుకున్నామని చెప్పు.. కచ్చితంగా అనర్హత వేటు వేస్తామని చెప్పు. ఎన్నికల్లో కొట్లాడుతాం.. మంచి పనులు చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి రా. అలా రా ధైర్యంగా ప్రజలలోకి. హైదరాబాద్‌లో చేసిందేమీ లేదు.. గబ్బు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని గల్లీలో స్థానిక నేతలు.. ఢిల్లీలో నీ పార్టీ గమనిస్తుంది. ఎక్కువ కాలం డ్రామాలతో అటెన్షన్ డైవర్షన్ గేమ్‌లతో రాజకీయం నడవదు. ఎక్కువ కాలం ఈ దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Sunitha Mahender Reddy | తెలంగాణలో రౌడీల పాలన నడుస్తున్నది : సునీత మహేందర్ రెడ్డి
RS Praveen Kumar | డీఎస్సీ ఫలితాల విడుదల ఎప్పుడు..? ఆలస్యంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్