హైదరాబాద్ : తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్నలిస్టు చిలుకా ప్రవీణ్‌పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్‌ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పరామర్శించారు.
హైదరాబాద్ పట్టణంలోని సోమాజిగూడ యశోద హాస్పిటల్లో(Yashoda hospital) చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు చిలుక ప్రవీణ్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు.
జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై విచక్షణరహితంగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇదేమీ రాజ్యం? ఇదేమీ దౌర్జన్యం? ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయటమేనా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతారా?
ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు,… pic.twitter.com/Be11aOgWAs
— KTR (@KTRBRS) October 3, 2024
ఇవి కూడా చదవండి..
KTR | పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం : కేటీఆర్