Saudi Arabia | సౌదీలో భారతీయులెవరూ చనిపోలేదు.. ఇండియన్ ఎంబసీ వెల్లడి
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) లోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు (Indian) చనిపోయాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. ప్రొజెక్టైల్ దాడిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.
Saudi Arabia : సౌదీ అరేబియా (Saudi Arabia) లోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు (Indian) చనిపోయాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. ప్రొజెక్టైల్ దాడిలో భారత్‌కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
అల్‌ఖర్జ్‌లోని నివాస ప్రాంతాల్లో ప్రొజెక్టైల్ పడిపోవడంతో భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారని సౌదీకి చెందిన సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల వివరాలపై ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు బంగ్లాదేశీయులేనని తెలిపింది. ఈ ఘటనలో మరో 12 మంది గాయపడగా.. వారిలో ఓ భారతీయుడు ఉన్నారని పేర్కొన్నది.
దీనిపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఆదివారం సాయంత్రం అల్ఖర్జ్లో జరిగిన దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని తెలిపింది. ఇది ఊరటనిచ్చే వార్త అని పేర్కొన్నది. ఈ వ్యవహారంలో స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు చేస్తున్నామని వెల్లడించింది. గాయపడిన వ్యక్తి అల్‌ఖర్జ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

