KTR | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు. రేవంత్ సర్కార్ పరిపాలన ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పెట్టుబడులు ఆగిపోయాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయి. ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది.
ఇక రాష్ట్ర ఖజానాకు తగ్గుతున్న ఆదాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం.. పరిపాలన వైఫల్యానికి నిదర్శనం.. అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి.. సీఎం రేవంత్ రెడ్డికి లేకపోవడంతో అసలు సమస్య ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ దుస్థితి ఉంటే.. వచ్చే నాలుగేళ్లు కష్టకాలమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప.. దిద్దుబాటు చర్యలు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం.. మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీదే అని కేటీఆర్ దుయ్యబట్టారు.
పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం..
పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం..
అనుభవ రాహిత్యంతోనే ఈ అనర్థం..సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి
సీఎంకు లేకపోవడంతోనే అసలు సమస్యకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఈ దుస్థితి ఉంటే.. వచ్చే నాలుగేళ్లు కష్టకాలమే
ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే… pic.twitter.com/70CtXuFX6g
— KTR (@KTRBRS) October 3, 2024
ఇవి కూడా చదవండి..
KTR | జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్‌పై కాంగ్రెస్ గూండాల దాడి.. తీవ్రంగా ఖండించిన కేటీఆర్