Revanth Reddy | సంగారెడ్డి : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. మరి ముఖ్యంగా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తుతున్నారు. చివరకు రుణమాఫీ చేయడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యంతో అర్హులైన వారికి రుణాలు మాఫీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుబంధుపై హరీశ్‌రావు ఓ రైతును అడిగారు. దీంతో ఆ రైతు తన బాధను హరీశ్‌రావు ముందు వెళ్లగక్కాడు.
రైతుబంధుల ఏదు ఏం లేదు.. రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చిండు. మేం వేసిన రొట్టె తునకతోటి బతికినోడు. ఆ కుక్క మాకే కరుస్తుంది ఇప్పుడు. దాన్ని ఎట్ల చంపాలి ఇప్పుడు. దానికి విషం పెట్టేది ఇప్పుడు మాతోని ఉన్నది. దాన్ని ఒక్కనాడు కాకున్న ఒక్కనాడు చంపుతం. ఆ కుక్కకు విషం పెట్టి ఏ తీరుగనైనా చంపుతాం. అది ఇస్తా ఇది ఇస్తా అని మాటలు చెప్పిండు. మేం రొట్టె తునక వేసినం.. మా రొట్టె తునక తిన్న కుక్క మాకే కరుస్తున్నది. ఆ కుక్కకు ఎట్ట విషం పెట్టి చంపాల్నో మా దగ్గర ఉన్నది అని రైతు తన బాధను తెలిపాడు.
మేము ఓట్లు వేస్తే గెలిచిన రేవంత్ రెడ్డి కుక్క మమ్మల్ని కరుస్తుంది.. ఆ కుక్కకి విషం పెట్టి సంపుతం – జహీరాబాద్ ఫార్మా సిటీ బాధితుడు pic.twitter.com/gWnGw0WOse
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
ఇవి కూడా చదవండి..
PCC President | జర జాగ్రత్తగా మాట్లాడండి.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ వార్నింగ్