హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. వాస్తవానికి మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభంకావాల్సి ఉండగా, అదే రోజు ఆదివారం కావడంతో ఈ సారి మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు షురూ కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే బడులు నడుపుతారు.
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం క్లాసులుంటాయి. ఈ బడులను మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుపుతారు. సెంటర్లున్న బడుల్లో తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. పది పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.