హైదరాబాద్: జర జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు పీసీసీ చీఫ్ (PCC President) మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడొద్దన్నారు. సమంత పై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల్ని భేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఇరు వైపులా మహిళలు ఉన్నారు.. అందుల్ల ఈ వివాదాన్ని ఇంటితో ముంగించాలని సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదని చెప్పారు.
సమంత, నాగచైతన్యపై కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆమె మాటలను సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. సమంతకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, సినీ సోదరుల సభ్యులను టార్గెట్ చేయడం సిగ్గు చేటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘మా’ సభ్యులపై ఇలాంటి దుర్మార్గపూరిత మాటల దాడులను చిత్రపరిశ్రమ తరపున అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం. సంబంధం లేని వ్యక్తులను, ప్రత్యేకించి మహిళలను తమ రాజకీయ వ్యవహారాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేసేలా.. రాజకీయ నేతలు ఎవరూ ఈ స్థాయికి దిగజారకూడదన్నారు.
వ్యక్తిగత పరిస్థితులను రాజకీయ మందుగుండులా వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించిందని విక్టరీ వెంకటేశ్ అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారి వ్యక్తిగత విషయాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా మార్చడం దురదృష్టకరం. పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవరికీ ఉపయోగం ఉండదు. అలా చేసిన వారికి బాధను మాత్రమే మిగులుస్తుంది. ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటిస్తూ.. సానుభూతి చూపించాలని కోరుతున్నాని చెప్పారు.
సినీ పరిశ్రమ ఇలాంటి వేధింపులను సహించదు..చాలని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ అన్నారు. మీరు ఓ మహిళగా ఉండి.. మరొక మహిళపై ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసినందుకు మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు.. కానీ మేము మీ స్థాయికి దిగజారలేము.