KTR | హైదరాబాద్ : తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్నలిస్టు చిలుకా ప్రవీణ్‌పై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. చిలుకా ప్రవీణ్‌పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదేమీ రాజ్యం..? ఇదేమీ దౌర్జన్యం..? ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయటమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతారా..? ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, విద్యార్థులు, ప్రజలు ఎవరు ప్రశ్నించిన ఎందుకింత అసహనం..? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేక వరుసగా జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. ప్రజల గొంతుకగా, ముఖ్యంగా దళిత బహుజన వర్గాల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై విచక్షణరహితంగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఇదేమీ రాజ్యం? ఇదేమీ దౌర్జన్యం? ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయటమేనా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడుతారా?
ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు,… pic.twitter.com/Be11aOgWAs
— KTR (@KTRBRS) October 3, 2024
ఇవి కూడా చదవండి..