MS Dhoni: గంభీర్, బుమ్రాపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన ధోనీ
MS Dhoni : టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్ చెప్పాడు మాజీ కెప్టెన్ ధోనీ. హెడ్ కోచ్ గంభీర్‌తో పాటు పేస్ బౌలర్ బుమ్రాపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీ స్పెషల్‌గా మెసేజ్ చేశాడు.
ముంబై: 2026 టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ సేన 96 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను మూడోసారి చేజిక్కించుకున్న టీమిండియా చరిత్రసృష్టించింది. అయితే 2007లో ఇండియాకు టీ20 వరల్డ్‌కప్ అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ప్రధాన కోచ్ గంభీర్‌తో పాటు బౌలర్ బుమ్రాపై ధోనీ తన మెసేజ్‌లో ప్రశంసలు కురిపించాడు. గంభీర్ తన కోచింగ్ నైపుణ్యంతో జట్టును విజయతీరాలకు తీసుకెళ్లినట్లు ధోనీ తన సందేశంలో పేర్కొన్నాడు. గంభీర్ తన బృందంతో అసాధారణ ప్రతిభను కనబరిచినట్లు తెలిపాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న జస్ప్రీత్ బుమ్రాను కూడా ధోనీ మెచ్చుకున్నాడు. బుమ్రా ఓ చాంపియన్ బౌలర్ అని తన మెసేజ్‌లో పేర్కొన్నాడు. బుమ్రా గురించి ఏమీ చెప్పకపోవడమే గొప్ప విషయమన్నాడు. భారత జట్టు అత్యద్భుతంగా రాణించిందని, అహ్మాదాబాద్‌లో చరిత్ర సృష్టించారని, భారత బృందానికి, సపోర్ట్ స్టాఫ్‌కు తన మెసేజ్‌లో ధోనీ కంగ్రాట్స్ తెలిపాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫీని నిలబెట్టుకుంది టీమిండిచా. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు ఇది వరుసగా రెండో వరల్డ్ కప్ (2024 తర్వాత) కాగా స్వదేశంలో ఈ ట్రోఫీ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు సాధించింది. ఫైనల్లో సంజూ శాంసన్ (46 బంతుల్లో 89, 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర మెరుపులతో భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఛేదనలో బుమ్రా (4/15) పేస్ పదునుకు తోడు అక్షర్ పటేల్ (3/27) స్పిన్ మాయతో కివీస్ 19 ఓవర్లలో 159కే కుప్పకూలింది. టిమ్ సీఫర్ట్ (26 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా నిరాశపరిచారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, శాంసన్‌కు(321 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

