పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మాజీ సర్పంచ్ల అర్ధ నగ్న ప్రదర్శన
మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యపేట కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు.
సూర్యాపేట : మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యపేట కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తాము అప్పులు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడ్డామని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయకుండా వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేండ్ల పదవి కాలంలో ప్రభుత్వం అందించిన సూచనలు, ఆదేశాల మేరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సర్పంచ్లకు బిల్లులు అందిస్తామని ప్రగ్భలాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీని విస్మరించి కాలయాపన చేస్తుందని ఆరోపించారు. అభివృద్ధి పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక మాజీ సర్పంచ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

