హైదరాబాద్ : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy) తండ్రి పురుషోత్తమ్(Purushotham reddy) రెడ్డి కొద్దిసేపటి క్రితం(Died) చనిపోయారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు. కాగా, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తమ్ రెడ్డి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మంత్రి ఉత్తమ్ కు పితృ వియోగం సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేశారు.