Harish Rao | హైదరాబాద్ : మూసీ నది సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి వేల మందిని నిరాశ్రయులను చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్న ప్లాట్లన్నీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో వారి ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ఇండ్లలో నివసిస్తున్న వారు కరెంట్ నల్లా బిల్లులు కడుతున్నారు. నది పరివాహక ప్రాంతంలో 40 ఏండ్ల నుంచి జీవిస్తుంటే నేలమట్టం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు..? మూసీ సుందరీకరణ పేరుతో వేల మందిని నిరాశ్రయులను చేస్తున్నవ్ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితుల ఇండ్లు తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి, కొత్తగా డబుల్ బెడ్రూం ఇవ్వాలని ఉంది. జీవనోపాధి కింద రూ. 5 లక్షలు ఇవ్వాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 2013 చట్టం చెబుతుందని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పేదలను ఒప్పించి చేయాలి తప్పా.. ఈ బెదిరింపులు సరికాదు. శని, ఆదివారాల్లో కూలగొట్టే ప్రయత్నాలు చేయడం మూర్ఖత్వం. సీఎంగా పేదలకు సహాయం చేయ్.. కన్నీళ్లు పెట్టించకు. లక్షలాది మంది నిద్ర పోని పరిస్థితి తెచ్చావ్.. భయభ్రాంతులకు గురి చేస్తున్నవ్.. ప్రజలకు ఇచ్చిన హామీలు చేయ్.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజల హక్కులను కాపాడాలి. బలవంతంగా ఖాళీ చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. జీవించి పోరాడాలి. పోరాడి సాధించుకోవాలి.. ప్రాణాలు తీసుకోవద్దు అని హరీశ్‌రావు బాధిత కుటుంబాలను విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Musi River | మూసీ నది ప్రక్షాళన.. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌పై దాన కిశోర్ కీలక వ్యాఖ్యలు
Musi River | బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే : దాన కిశోర్
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్