Harish Rao | హైదరాబాద్ : మూసీ ప్రక్షాళన పేరిట.. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను కూల్చేసేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగావు. మూసీలో నీళ్లు పారించాలి అనుకుంటున్నావా..? పేదోళ్ల కన్నీళ్లు, రక్తం పారించాలి అనుకుంటున్నావా..? అని రేవంత్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రి వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ హైడ్రా వేధింపులు భరించలేక.. ఆందోళనతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే 3 ఆత్మహత్యలు జరిగాయి. ఇంకా ఎంత మందిని చంపదలచుకున్నావు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. నీ యొక్క తప్పిదాలు, చర్యల వల్ల పేదోళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేని కోసం మూసీ సుందరీకరణ చేస్తున్నవ్. ఎంత మందిని పొట్టన పెట్టుకోదలుచుకున్నావ్.. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.. వాటిని షరిష్కరించు అని హరీశ్‌రావు సూచించారు.
గాంధీ ఆస్పత్రిలోని ప్రయివేటు మెడికల్ షాపుల వద్ద లైన్లలో నిలబడి మందులు కొంటున్నారు. ఆస్పత్రిలో ఉచితంగా ఇచ్చే పారాసిటామల్, గ్యాస్ సమస్యకు వాడే మందుల్లేక విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేశారు రేవంత్ రెడ్డి. రెసిడెన్షియల్ హాస్టల్లో పిల్లలు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. వ్యాధులతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ఆ పనుల మీద రివ్యూ చేయమంటే కూల్చే పనిమీద పడ్డడు. నీవు కట్టే పని చేయ్.. హైదరాబాద్‌ను నిలబెట్టే పయత్నం చేయ్. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో.. కూల్చివేతలు మానుకో.. పేద ప్రజల ఉసురు పోసుకోవద్దని హెచ్చరిస్తున్నాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Gandhi Bhavan | కాంగ్రెస్‌ను వెంటాడుతున్న మూసీ బాధితుల భయం.. గాంధీ భవన్ వద్ద భద్రత పెంపు
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
Harish Rao | అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి: హరీశ్ రావు