Gandhi Bhavan | హైదరాబాద్ : మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రివర్ బెడ్ మార్కింగ్ కూడా వేశారు. దీంతో బాధిత ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మూసీ బాధితులంతా కూల్చివేతలను నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో గాంధీ భవన్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూసీ బాధితులు దాడి చేస్తారేమో అనే భయంలో గాంధీ భవన్ వద్ద భద్రత పెంచారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలు కోల్పోయిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్కు బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
హైడ్రా బాధితులు దాడి చేస్తారేమో అనే అనుమానంతో గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ
గాంధీభవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు గాంధీభవన్ ముట్టడికి పిలుపు
మూసి పరివాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్ బఫర్… pic.twitter.com/vmdbJng5yL
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలల కిందట మూసీకి ఇరువైపులా 2 కిలో మీటర్ల మేర డ్రోన్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేశారు. జీయో ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఎస్ఐ)తో అనుసంధానం చేశారు. కాగా, ఈ సర్వేలో రివర్ బెడ్(నది గర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వాటికే మార్కింగ్ చేస్తున్నారు. అయితే రివర్ బెడ్లో ఉన్న అన్ని నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కూల్చివేతలు ప్రారంభమయ్యాక మార్కింగ్ వేసినవి..వేయనివి అన్నీ మూసీలో కలిసిపోతాయి. కేవలం అధికారులు మార్కింగ్ వేసిన వారికి మాత్రమే డబుల్ బెడ్రూంలు కేటాయించనున్నారు. మిగిలిన వారు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడనున్నదని సామాజికవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి: హరీశ్ రావు
HYDRAA | పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నం.. కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు..
Suryapet | 50 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. మా ఇండ్లు కూల్చొద్దు