హైదరాబాద్: పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది అంటూ ఓ బాధితురాలు వాపోయారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ గోడు వెళ్లబోసుకునేందుకు హైడ్రా (HYDRAA) బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌కు చెందిన ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. దయచేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నామని, అన్నం కూడా తిన్మామో లేదో తమకే తెలుసని చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళనతో క్షణక్షణం భయంతో గడపవలసి వస్తుందన్నారు.
గొంతులో అన్నం దిగట్లేదని చెప్పారు. అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదన్నారు. లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చుకుని మేము ఇళ్లు కట్టుకున్నారని, ఇప్పుడు కూల్చేస్తే తమ పిల్లలు రోడ్డున పడతారని చెప్పారు. తకు అండగా ఉంటారని తెలంగాణ భవన్‌కు వచ్చాం. తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. టీవీ చూస్తుంటే భయం అవుతున్నదని తెలిపారు. రాజకీయ నాయకులే తమను మోసం చేస్తే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ వాపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని, అధికారులతో మాట్లాడిన కూడా స్పందన కరువైందని వాపోయారు. బీఆర్ఎస్ నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వచ్చామని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ, ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని మండిపడ్డారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న హైడ్రా బాధితుల కష్టాలు
కంటి మీద కునుకు ఉండట్లేదు.. ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్దం కావట్లేదు
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నం.. మా ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు.. మా గుండె ఆపోతుంది
గొంతులోకి అన్నం దిగట్లేదు.. టీవీ చూస్తే భయం అయితుంది.. రాజకీయ… https://t.co/sNZY6LMeth pic.twitter.com/AeSk50ftl3
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024