Gandhi Hospital | హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పై నుండి ఆదేశాలు ఉన్నాయంటూ మార్చురీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
హైదరాబాద్‌లో దూకుడుతో ఉన్న హైడ్రా ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంగతి తెలిసిందే. తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి. తమ కూతుళ్ల కుటుంబాలకు ఆధారం పోతుందన్న బెంగతో ఉరేసుకొని ప్రాణమే తీసుకున్నది. హైడ్రా చర్యలతో కట్టుబట్టలతో బజారున పడుతూ దుఃఖసాగరంలో ఎన్నో బాధిత కుటుంబాలు మునిగిపోతుండగా, ఏకంగా ఓ మహిళ ప్రాణం తీసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో విషాదం నిండుకున్నది. కూకట్పల్లి రామాలయానికి చెందిన గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులు కూలిపనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. ముగ్గురికీ వివాహాలు చేసి కట్నం కింద నల్ల చెరువు వద్ద ఉన్న ఇం టిని ఇచ్చారు. కూల్చివేతల్లో భాగంగా నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు ఇండ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కూతుళ్లకు ఇచ్చిన ఇల్లు కుల్చివేస్తే బిడ్డలు రోడ్డున పడుతారనే మనస్తాపంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో బుచ్చమ్మ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబసభ్యు లు దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.
గాంధీలో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు.
పై నుండి ఆదేశాలు ఉన్నాయంటూ మార్చురీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న… https://t.co/8DwptTB4Md pic.twitter.com/N4zSShPjBg
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024
‘మా అమ్మ జీవితాంతం నాన్నతో కలిసి కూలిపనులు చేసి, రూపాయి రూపాయి కూడేసి ఇల్లు కట్టించింది. ఇప్పటికీ రెక్కల కష్టంతోనే బతుకుతున్నరు. ముగ్గురు ఆడపిల్లల పెండి చేసిండ్రు. ఇల్లు ముగ్గురికీ కట్నంగా ఇచ్చిండ్రు. ఒక్కసారిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చివేస్తామని అనేసరికి పాణందీసుకున్నది’ అని బుచ్చమ్మ కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకునే మనిషి కాదు. చాలా ధైర్యవంతురాలు ఆమె. ఇట్ల చేసుకుంటదని అనుకోలేదు. కొడుకులు లేకున్నా మాకున్న ఇల్లును చూసి పిల్లలు మంచిగ ఉంటారు కదా అనుకుంటూ ఉండేది. కూల్చివేస్తారన్న విషయాన్ని విని ఆమె తట్టుకోలేకపోయింది. మాకు కూడా ఆడపిల్లలే కలిగారు. వారి భవిష్యత్తు కూడా ఈ ఇంటిమీదే ఆధారపడి ఉన్నదన్న బెంగ ఉండేది. ఈ ప్రభుత్వానికి ఏది న్యాయమో అర్థం కావడంలేదు. పేద ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నదన్న సమాచారంతో బంధువులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. భర్త, కూతుళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఎన్నో ఆశలతో సొంతంగా కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక్కసారిగా ప్రభుత్వం కూల్చివేస్తుందన్న భయమే ఆమెను వెంటాడి ఈ స్థితికి చేర్చిందని స్థానికులు వాపోయారు.
ఇవి కూడా చదవండి..
KTR | 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధడుతున్నా.. కేటీఆర్ ట్వీట్
Harish Rao | అఖిలపక్షంతో సంప్రదించాకే మూసీపై ముందుకెళ్లాలి: హరీశ్ రావు
Telangana Bhavan | తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధిత కుటుంబాలు