Musi River | బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే : దాన కిశోర్
Musi River | మూసీ నది ప్రక్షాళనలో భాగంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివట్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు. ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
Musi River | హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళనలో భాగంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివట్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ స్పష్టం చేశారు. ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మూసీ, హైడ్రాపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాన కిశోర్ మాట్లాడారు.
గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చేవి. ఆ వరదల సమయంలోనూ నిర్వాసితులను తరలించారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు. 1927లో వరదల వల్ల భారీ నష్టం జరిగింది. ఇటీవల భారీ వర్షాలు కురిసి హైదరాబాద్ మునిగిపోయింది. మొన్న దాదాపు 9 సెం.మీ. పైగా వర్షాలు హైదరాబాద్‌లో కురిశాయి. చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తింది. భారీ వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏం చేయలేరు. ప్రజల కోసమే మూసీ అభివృద్ధి చేస్తున్నాం. మూసీ నది సుందరీకరణ కోసం ఈ చర్యలు తీసుకోవడం లేదు. మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలే. ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. చారిత్రాత్మక ప్రదేశాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని దాన కిశోర్ తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉంది. మూసీ పరివాహ ప్రాంతం మురికి కూపంలా మారింది. మూసీకి వరదలు వేస్తే ఇబ్బందులు పడేది ప్రజలే. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తాం. 2030 కల్లా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుతుంది. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3800 కోట్ల వ్యయం చేస్తున్నాం. 2026 జూన్ లోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎకప్పటికైనా తొలగించాల్సిందే. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తాం. మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని దాన కిశోర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉంది : ఏవీ రంగనాథ్
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
TG Weather | తెలంగాణలో మరో రెండురోజులు వానలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

