Musi River | హైదరాబాద్ : మూసీ నది ప్రక్షాళన కోసం ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూసీ నదిలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిశోర్ కీలక సమాధానం ఇచ్చారు.
ఎంజీబీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు స్టేషన్ నిర్మించారు. దాని పరిస్థితి ఏంటని దాన కిశోర్‌ను మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దాన కిశోర్ స్పందిస్తూ.. మూసీలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ గురించి కూడా చర్చించి తగిన రీతిలో స్పందిస్తాం. ఈ మెట్రో స్టేషన్‌పై ఎన్జీవోలు కూడా మమ్మల్ని అడిగారు. అది కొంచెం సిరీయస్ అంశం. ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు దాన కిశోర్.
ప్రయివేటుకు సంబంధించిన అక్రమణలను తొలగిస్తున్నారు కదా.. మరి గవర్నమెంట్ ఆస్తుల విషయంలో గవర్నమెంట్ ఎలా రియాక్ట్ కాబోతుందన్న ప్రశ్నకు.. పై స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఎన్జీవోలు కూడా అదే అడిగారు. దీనిపై తప్పకుండా సరైన సమయంలో స్పందిస్తాం అని దాన కిశోర్ బదులిచ్చారు.
మూసీలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ గురించి కూడా చర్చించి తగిన రీతిలో స్పందిస్తాం – మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్ pic.twitter.com/9iUjyWuvPt
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024
ఇవి కూడా చదవండి..
Musi River | బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఇండ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందే : దాన కిశోర్
HYDRAA | ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉంది : ఏవీ రంగనాథ్
Harish Rao | మూసీలో రక్తం పారించాలనుకుంటున్నావా..? రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్