Oh god! fill my city with people just as you have filled river with fish.
433 సంవత్సరాల క్రితం 1591లో ఒక సుదినాన హైదరాబాద్ నగరానికి పునాది గోల్కొండ ప్రభువు షాహీ చేసిన ప్రార్థనా వాక్యం హైదరాబాద్ శతాబ్దాలుగా విశ్వనగరంగా అభివృద్ధి వచ్చింది.
Telangana | ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం అప్పట్లో దేశ ప్రజలను, వారి హృదయాలను చూరగొన్నది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ ఎత్తుకున్న ‘నఫ్రత్ కీ బజార్ మే మహబ్బత్ కా దుకాణ్’ కూడా పీడిత ప్రజలను, దళిత బహుజనుల ను, ప్రత్యేకించి మైనారిటీలను ఆకట్టుకుంది. బీజేపీ పాలనలో అభద్రతాభావానికి గురవుతు న్న ప్రజానీకం మెజారిటీ మతతత్వవాదం పేట్రేగిపోతున్న సందర్భంలో అందుకున్న నినాదం సహజంగానే ప్రజలను ఆకర్షించింది. తత్ఫలితంగానే కాంగ్రెస్ తిరిగి కొంతమేరకు పుంజుకోవడమే కాకుండా అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పీఠం కైవసం చేసుకున్నది.
కానీ, దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ సర్కార్ కేవలం కుల సమీకరణాల వచ్చామనే వ్యవహరిస్తూ రాష్ర్టానికి, పేద, మధ్యతరగతి బడుగు జీవులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నది. యూపీ, గుజరాత్, అసోం బీజేపీ పాలిత బుల్డోజర్ పద్ధతులను అవలంబించి అతి తక్కువ కాలంలోనే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉండిన దళిత, బహుజన, మైనారిటీ వర్గాల తీవ్ర ఆక్రోషాన్ని ఎదుర్కొంటున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైడ్రా ఆపరేషన్లు సంపన్న, సూడో మేధావి వర్గాలకు ఆనందాన్ని కలుగజేస్తుండవచ్చు. కానీ, పేద, మధ్యతరగతి జీవితాలను చేస్తున్నాయి. ఎప్పుడో దశాబ్దాల కిందట పేద ప్రజ లు కట్టుకున్న నగరంలో వర్షాల వల్ల కలిగే ప్రకృతి వైపరీత్యాల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న ఉన్నది.
కులీన సంపన్నవర్గాలు దశాబ్దాలుగా చేస్తు న్న పర్యావరణ బీభత్సం, ఔటర్ రోడ్డు విధ్వంసం, అర్బనైజేషన్ పేరిట పారిశ్రామికీకరణ, ఫార్మా, ఐటీరంగాల వల్ల తెలంగాణ రాష్ర్టానికి హైదరాబాద్, పరిసరప్రాంతాల్లో జరిగిన ఏపాటిదో పాలకులు గుర్తించడం చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రైవేట్ రంగంలో వెట్టిచాకిరీ చేసి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల ను వెచ్చించి, తల ప్రైవేట్ పేదలు కట్టుకున్న గూళ్లను నేలమట్టం చేయడం ఏ దుకాణో’ రాహుల్ గాంధీ చెప్పాలి.
పది మిలియన్ సంవత్సరాల కిందట ఏర్పడిన రాతి శిలలను, గుట్టలను రేయింబవళ్లు రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్న విధ్వంసం కంటే పేద ప్రజలు కట్టుకున్న ఇరుకు గదుల ప్రకృతి వైపరీత్యం ఎక్కువైందా? మూసీ, ఈసీ, కాగ్నా నదుల జన్మస్థానం వికారాబాద్, అడవుల్లో లో ఫ్రీక్వెన్సీ రాడార్ కోసం లక్షలాది చెట్ల నరికివేత ప్రకృతి విధ్వంసం ముందు చేస్తున్న నష్టం పటాన్చెరు, పాశమైలారం, జీడిమెట్ల, బొంతపల్లి తదితర ప్రాం తాల్లో వెలసిన కాలుష్య ప్రకృతి నం ఇళ్లలో బోళ్లు, బొచ్చె లు కడిగి బడుగుజీవుల ప్రకృతి విధ్వంసం భరించరానిదైందా?
తెలిసో, తెలియకో అవసరాల రియల్ వ్యాపారుల మోసాలకు, అమాయక జీవనాన్ని విధ్వంసం చేసిప్రజా ప్రభుత్వం చెప్పుకొంటు న్న కాంగ్రెస్ సాధించాలనుకుంటున్నది? షీటర్లు, నేరస్థులు, సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడానికి యూపీ రాష్ర్టానికి పరిమితమైన బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అదే పంథాను తెలంగాణ రాష్ట్రంలో పేద, తరగతి ప్రజల మీద కొనసాగించాలనుకోవడమే అసలై న ప్రకృతి వైపరీత్యం.
దక్కన్ పీఠభూమి తెలంగాణ రాష్ర్టానికి వాగులు, నాలాలు, గుట్టల పరిరక్షణ పేరిట హైడ్రా చేపట్టిన చర్యలు అపసవ్య దిశలో ఉండటమే ప్రస్తుత భయానక భీతావహ పరిస్థితుల కు కారణమని చెప్పవచ్చు. ఒకవేళ ప్రారంభించాల్సి వస్తే బఫర్జోన్ల లో లే అవుట్లు వేసి, ఇండ్లను కట్టి అవసరమైన అనుమతులను సంపాదించి అమాయకప్రజలకు ఎస్టేట్ మీద కదా మొదట చర్యలు తీసుకోవాల్సింది. నాలా కన్వర్షన్, బిల్డింగ్ అనుమతులు ఇచ్చి ఆస్తి పన్నులు, కరెంటు బిల్లులు చేసి నప్రభుత్వం బాధితులకు ఆమోదయోగ్యమై న పునరావాసాలు కల్పించిన రంగంలోకి దిగాల్సింది. ఎలాంటి అనుమతు లు లేని నాలాల మీద వెలసిన అక్రమ కట్టడా లు తొలగించడానికి ముందు ప్రాంతాల్లో ప్రభుత్వమే డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
భవిష్యత్తులో ఎవ్వరికీ 500 పైబడి స్థలంలో నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వకూడదు. ఎందుకంటే, జనాభా పెరుగుతుంది కానీ, భూమి పెరగదనే ప్రాథమిక సూత్రాన్ని మరచిపోకూడదు. వేలాది అపార్టుమెంట్లు, విల్లాలు కడుతున్న రియల్ వ్యాపారులు భవిష్యత్తులో వారి ఇండ్లలో పనిచేయాల్సిన పనివారు, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు నివాసం ఉండటానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా బిల్డర్ల పరిధిలోనే ఉండేలా చట్టం తీసుకురావాలి.
– తుల్జారాంసింగ్ ఠాకూర్ 78930 05313