Mrunal Thakur | యానిమల్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మృణాల్ వ్యాఖ్యలు
తొలి చిత్రంతోనే తెలుగువారికి చేరువైంది మృణాల్ ఠాకూర్! ‘సీతారామం’తో వెండితెరపై మెరిసి.. ‘సీత’గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో కట్టిపడేసే ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకున్నది.
Mrunal Thakur | తొలి చిత్రంతోనే తెలుగువారికి చేరువైంది మృణాల్ ఠాకూర్! ‘సీతారామం’తో వెండితెరపై మెరిసి.. ‘సీత’గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో కట్టిపడేసే ఈ మరాఠీ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్‌ను సంపాదించుకున్నది. తాజాగా అబుదాబీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) ఉత్సవ్‌లో పాల్గొన్నది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంతకూ మృణాల్ ఏమన్నదంటే.. ‘అందరూ యానిమల్ సినిమాలో రణ్‌బీర్ పాత్ర గురించే మాట్లాడుతున్నారు. ఆ పాత్ర ఎంతో క్రూరంగా ఉన్నదని విమర్శిస్తున్నారు. అయితే, 2012లో ఇదే రణ్‌బీర్ ‘బర్ఫీ’లో చెవిటి-మూగ వ్యక్తిగా నటించిన విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. అప్పుడు అమాయకుడిగా.. ఇప్పుడు యానిమల్గా రెండు విభిన్న పాత్రలను అద్భుతంగా పండించాడు రణ్‌బీర్..’ అంటూ కపూర్ల వారసుణ్ని ఆకాశానికి ఎత్తేసింది. బర్ఫీ, యానిమల్ చిత్రాల్లో అద్భుతమైన నటనా కౌశలాన్ని పండించిన రణ్‌బీర్.. రెండు చిత్రాలకూ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకోవడం విశేషం!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

