హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ(Rakhi pournami) సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth reddy) మంత్రి సీతక్క(Minister Seethakka) రాఖీ కట్టారు. సీతక్కతో పాటు ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన మహిళా నేతలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క pic.twitter.com/nZ21QE5Krp
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024
Also Read..