చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న దృష్ట్యా, విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
- భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లు అమలు
- అందుకే మహిళలు రాజకీయాల్లోకి రావాలి
- బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల్లో 50% మహిళా రిజర్వేషన్లు కల్పించాం:కేటీఆర్
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న దృష్ట్యా, విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం కేటీఆర్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్య్రమే అసలైన గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన ఉంటేనే మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులో కూడా మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

