మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు
మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు అని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా మహిళల భాగస్వామ్యం ఇమిడి ఉన్నదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలు అని, దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా మహిళల భాగస్వామ్యం ఇమిడి ఉన్నదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడను కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాలతో నిర్వహిస్తున్న మహిళ త్యాగశీలి అని కేసీఆర్ కొనియాడారు.
అకాశంలో సగమై, అపార శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న మహిళ అన్ని రంగాల్లో పురుషుడితో సమానమైన అవకాశాలను మరింతగా అందించినప్పుడు మాత్రమే కుటుంబాభివృద్ధి సంపూర్ణమవుతుందని, తద్వారా సమాజ, దేశ, ప్రపంచాభివృద్ధి పరిఢవిల్లుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో, అనంతర స్వయం పాలనలో మహిళల పాత్ర గొప్పదని తెలిపారు. మహిళా సాధికారత దిశగా వారి సంక్షేమం, ప్రగతి కోసం పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహిళా సాధికారతను మరింత పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరమున్నదని కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

