వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు
వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
- బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ పార్టీ లీడర్ వద్దిరాజు
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళానేతలను ఘనంగా శాలువాలతో సన్మానించారు. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పార్లమెంట్లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. సమాజం లో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అవకాశాలను అందిపుచ్చుకొని అత్యున్నతస్థాయికి చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. వారి పేరిటే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

