Minister KTR | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశానికి ఎప్పటికీ దండగేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోయినప్పటికీ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం.. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకున్నా.. దిగ్గజ ఐటి కంపెనీలన్నీ తెచ్చుకున్నమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని.. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికీ దండగేనని విమర్శించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకున్నా..
దిగ్గజ ఐటి కంపెనీలన్నీ తెచ్చుకున్నంజాతీయ హోదా ఇవ్వకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నం
పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తున్నంకాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
“మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ”ని
సీఎం కేసీఅర్ గారి చేతుల మీదుగా
ఘనంగా…— KTR (@KTRBRS) June 22, 2023
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు. స్వపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం చిరస్మరణీయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మన ప్రయాణంలో తెలంగాణ ఉద్యమ నినాదాలు, నిస్వార్థ త్యాగాలు ఒక మైలురాయిగా నిలిచిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్‌గా ఎదిగిందన్నారు. హైదరాబాద్ నడిఒడ్డున ఏర్పాటు చేసుకున్న అమరజ్యోతి అమరవీరుల త్యాగానికి గుర్తుగా మిగిలిపోతుందని.. వాళ్ల త్యాగాలు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు వందనాలు తెలిపారు.
Telangana, an iconic chapter in the annals of world public movements, led the democratic struggle for self-governance
The slogans of the Telangana movement and the selfless sacrifices stand as timeless milestones along our journey. In just nine years, under the able leadership… pic.twitter.com/Eh5NyzJtnd
— KTR (@KTRBRS) June 22, 2023