Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌లో మస్త్ ఖుషీగా గడిపాడు. గోట్ ఇండియా టూర్లో భాగంగా శనివారం హైదరాబాద్ విచ్చేసిన మెస్సీ.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించాడు. అలాగనీ జెర్సీ ధరించి మైదానంలోకి దిగి తన మార్క్ గోల్స్‌తో ఈ స్టార్ ప్లేయర్ చెలరేగలేదు. కానీ, ఆద్యంతం నవ్వుతూ, ఉత్సాహంగా సందడి చేశాడీ సాకర్ మాంత్రికుడు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో మట్లాడుతూ.. ‘హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద’ని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అన్నాడు.
భారత పర్యటనలో కోల్‌కతాలో తన నిలువెత్తు 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మెస్సీ శనివారం హైదరాబాద్ వచ్చేశాడు. సహచరులు సూరెజ్, రొడ్రిగో డిపాల్‌తో కలిసి ఉప్పల్ మైదానం చేరుకున్న అర్జెంటీనా స్టార్.. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సరదా ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత విజేతలుగా నిలిచిన సింగరేణి ఆర్ఆర్ జట్టుకు ట్రోఫీని ప్రదానం చేశాడు మెస్సీ.
Lionel Messi addressing the Audience in India:
“Hello everyone. Well, nothing but to extend my thanks for the love I’ve received today and always
The truth is that I’ve seen a lot of things before getting here, throughout this whole time”— MC (@CrewsMat10) December 13, 2025
అనంతరం మాట్లాడిన అతడు.. ప్రతిఒక్కరికి హలో.. ఈరోజు నాకోసం ఇక్కడి వచ్చినందుకు.. నాకు గొప్పగా స్వాగతం పలికినందుకు మీకు ధన్యవాదాలు. ఇక్కడికి రావడానికి ముందు నేను చాలా విషయాలు చూశాను. మీరు నాపై చూపిన ప్రేమాభిమానులు చిరకాలం గుర్తుండిపోతాయి అని చెప్పాడు. గోట్ ఇండియా టూర్లో మూడో అడుగు ముంబైలో వేయనున్నాడు మెస్సీ. డిసెంబర్ 14, ఆదివారం అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని.. డిసెంబర్ 15 ఆదివారం ఢిల్లీలో మెస్సీ సందడి చేయనున్నాడు.
The chief minister of Telangana couldn’t even make a simple pass to Messi 😭pic.twitter.com/f6WOlu2g33
— Troll Football (@TrollFootball) December 13, 2025