Lionel Messi : ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన లియోనల్ మెస్సీ(Lionel Messi) అభిమానులకు షాకిచ్చాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి ఫ్యాన్స్‌ను అలరిస్తాడనకుంటే.. చిన్నారులకు శిక్షణతోనే సరిపుచ్చాడు. కనీసం జెర్సీ కూడా వేసుకోకుండా మైదానంలోకి దిగిన సాకర్ మాంత్రికుడు సహచరులు సూరెజ్, రొడ్రిగో డిపాల్.. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సరదా ఫుట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత విజేతలుగా నిలిచిన సింగరేణి ఆర్ఆర్ జట్టుకు ట్రోఫీని ప్రదానం చేశాడు మెస్సీ.
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ .. ‘గోట్ ఇండియా టూర్’లో రెండో రోజు హైదరాబాద్‌లో సందడి చేశాడు. శనివారం సాయంత్రం తన బృందంతో కలిసి శంషాబాద్ విమాశ్రయంలో దిగిన సాకర్ దిగ్గజం.. భారీ భద్రత నడుమ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లాడు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ ఫొటో సెషన్ కార్యక్రమంలో పాల్గొన్న మెస్సీ.. సాయంత్రం 6:30 గంటలకు 20 వాహనాల కాన్వాయ్‌లో ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాడు. భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేసిన మెస్సీ.. మైదానంలో చిన్నారులకు శిక్షణ ఇచ్చాడు.
Messi vs Revanth in Uppal stadium pic.twitter.com/73dpcy2q57
— Lutyens Media (@LutyensMediaIN) December 13, 2025
అయితే.. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ టీమ్‌తో అతడు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సింది. అయితే.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్ ఆడనందున… ఉప్పల్‌లోనూ కేవలం స్టిల్స్‌కు మాత్రమే పరిమితమయ్యాడీ సాకర్ లెజెండ్. అనంతరం విజేతలుగా నిలిచిన సింగరేణి ఆర్ఆర్ టీమ్‌కు, రన్నరప్ అపర్ణ జట్టుకు మెస్సీ, రేవంత్ రెడ్డి ట్రోఫీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. మెస్సీ రాకకు ముందు ఉప్పల్ స్టేడియంలో లేజర్ షో వేశారు. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీలు తమ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించారు.
🚨 BREAKING NEWS
Lionel Messi had a long chat with #RahulGandhi at Uppal Stadium Hyderabad
Messi looked interested and approached Rahul Gandhi throughout 🔥
India needs such leader as Prime Minister. What a proud moment for every Congressman and Indians ❤️ pic.twitter.com/CxwQeY8ohP
— Amock_ (@Amockx2022) December 13, 2025